Wednesday, February 26, 2014 - 0 comments

అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!

తనని ఎంతగానో ప్రేమిస్తాం ,
తనే జీవితంగా బ్రతికేస్తాము , 
కష్టమొచ్చిన, నష్టమొచ్చిన తనకే చెప్పేస్తాం...!!

ఏ చిన్న విషయమైన తన దగ్గర దాచటానికి కూడా ఇష్టపడం,
తనంటే  నమ్మకం, తనే ఇకపై  మన జీవితం...
కాని  ఉన్నట్టుండి ఒక రోజు,ఏదో ఒక విషయంలో,
అది కూడా ఒక చిన్న భేదాభిప్రాయం వల్ల తనని దూరం పెట్టేస్తాం (దూరం అవుతాం)
ఇన్నాళ్ళు తనే మనంగా బ్రతికిన మనం 
తను చేసిన చిన్ని తప్పుల్ని మన్నించలేమా ?
ఈ ప్రపంచంలో ఎవ్వరు ఏ తప్పు చేయకుండా ఉండలేరు
అలాంటిది ఇలా చిన్ని చిన్ని కారణాల
వల్ల తనని దూరం చేసుకోవటానికి,
తనకి దూరంగా ఉండటానికి నిర్ణహించుకుంటాం... 

తను లేకుండా మనకి కొత్త జీవితం ఉండొచ్చు 
కాని దేవత(దేవుడు) లేని  గుడిలా,
గురువు లేని బడిలా,
తల్లి ఒడిలో పెరగని బిడ్డలా . ..  

ఒక చిన్ని నిర్ణయం రెండు నిండు జీవితాలు 
అంతా మన చేతుల్లోనే, అంత మన నిర్ణయాలలోనే ..!!!
                                                      -నందు

Friday, February 14, 2014 - , , , , 4 comments

కేవలం తనని మాత్రమే ప్రేమించటం..!!!

ప్రేమించటం అంటే తన గతాన్ని గుర్తుంచుకుని,
తన వర్తమానాన్ని ఊహించుకుని ప్రేమించటం కాదు...  
కేవలం తన ప్రస్తుత స్థితిని మాత్రమే  ప్రేమించటం 
ప్రేమించటం అంటే తనని మాత్రమే ప్రేమించటం,

అవును కేవలం తనని మాత్రమే... 
                      
                              -నందు
Sunday, February 02, 2014 - , , 0 comments

ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???

పిల్లల దృష్టిలో ప్రేమంటే
అందం, కులం, మతం, జాతి, ఆస్తి, అంతస్తులాంటివేమి ఉండవు
కేవలం తను ప్రేమించిన వ్యక్తి, 
ఆ వ్యక్తి పైన నమ్మకం, తనతో ఇక మిగిలిన జీవితం...!!

కాని పెద్దల దృష్టిలో

ప్రేమంటే పైవన్నీ... 
వాటితో పాటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు, 
రెండు కుటుంబాలు,
వీళ్ళ బంధాన్ని ఆశీర్వదిస్తూ కొన్ని వందల జీవితాలు... 
అంతకంటే ముఖ్యంగా ఎన్నో అనుభవాలు, 
అవి పిల్లలకి చేదు జ్ఞాపకాలుగా మిగలకూడదని వీళ్ళ తాపత్రేయాలు...!!

పిల్లల దృష్టిలో వారి  ప్రేమ, 

పెద్దల దృష్టిలో వీరి ప్రేమ రెండు సరైనవే
ఇక్కడ ఒకరిని సమర్ధించి మరొకరిని నిందించటానికి వీల్లేదు
ఎందుకంటే ఈ ఇద్దరి ప్రేమల మద్య ఉన్నది కూడా ప్రేమే
అందరిలో ఉమ్మడిగా నలిగేది కూడా ప్రేమేగా...???
                                             -నందు